Posts

Showing posts from November, 2022

వచ్చే వచ్చేపండుగొచ్చే*..అయ్యప్ప స్వామి పాటలు

 *వచ్చే వచ్చేపండుగొచ్చే* *పల్లవి* వచ్చే వచ్చే పండుగొచ్చే వచ్చే అయ్యప్ప స్వాముల దీక్షాలొచ్చే           దండి దీక్షాలొచ్చే ... చరణం. ఊరు వాడల భక్తి భావాలు ఉప్పొంగే... కామక్రోధాలు వదిలి కలిసీమెలిసందారు... బజన సంకీర్తనలతో సజ్జన సాంగత్యంతో సత్యవ్రతగదారులై .... స్వామిస్వామి నామంతో ౹౹వచ్చే...వచ్చే౹౹ చరణం ...2 అలంకారాలు వదిలి ఆహార రుచి మరిచి  శ్రవణ మననాలతో  మనోశుద్ది చేసుకొని నవ విధ భక్తితోడ  నానా సేవలు చేసి నూతన శక్తినిపొంది  నిత్యానందముతోడఁ ౹౹వచ్చే౹౹2౹౹ డా౹౹మంగళ మక్కపాటి.

మంగళ హారతి*..అయ్యప్పస్వామి

 *మంగళ హారతి* పల్లవి.. మంగళం..మంగళం మంగళం...మంగళం కోటి కోటి నక్షత్రాలు కోరి కోరి నీకై తెచ్చి  హారతివ్వ వేచామయ్యా .. అయ్యప్పా... మంగళం జయమంగళం మంగళం శుభమంగళం...౹౹మంగళం౹౹కోటి కోటి౹౹ చరణం.1 శరణన్న కరుణించే నీ చరణ కమలాలకు ... స్మరణ లోనే రక్షించే  నీ దివ్య హస్తాలకు..జయ మంగళం శుభ మంగళం ౹౹మంగళం౹౹కోటి౹౹ చరణం.2... ఆర్థజన మందార నీ దయామృత హృదయానికి.. అనంత కోటి తేజస్సుతో అలరారే నీ వర్ఛస్సుకు జయ మంగళం శుభమంగళం        ౹౹మంగ౹౹కోటి౹౹ చరణం.3 ముక్కోటి దేవతలు  మునిజనులు ...భక్తులు ముదమారగా నీ ముందు  ముగ్దులై నిలుచుండిరి కర్పూర కాంతిలో... నీ శోభల శోభచూస్తూ  తన్మయంతో తూలే వేళ  జయ మంగళం ...శుభమంగళం ౹౹మంగ౹౹కోటి౹౹ దీనులమయ్యప్పా... అతి దీనులమయ్యాప్పా ఏలుకో అయ్యప్పా మమ్మెలుకో అయ్యాప్పా హారతి అయ్యాప్పా.. మంగళ హారతి అయ్యప్పా స్వామియే.... శరణమయ్యప్పా..౹౹4౹౹ మంగళం మంగళం... జయమంగళం౹౹2౹౹ ....మంగళ

ముద మరగా నీ రూపం*

 *ముద మరగా నీ రూపం* ముద మారగ నీ మోమును               చూద్దామంటే మధుసూధను డేలా మారాము                       చేస్తాడు    నీ దరహాసంతో     కాస్తా మరిపించమ్మా                               !!ముద!! చరణం1. వెన్నెల రాజుతో కలిసిఇటు                           రావమ్మా మల్లెల మాలలుచేకొని                     మమ్మేలమ్మా శుక్రవారం వేళా సుచిగా              నోములు నోచి చిరునవ్వుల పల్లకిని         సిద్ధంగా ఉంచి హృదయ వీధిలో మిమ్ము           ఊరేగించాలని మా భావాల బంధువులతో   వేచి ఉన్నామమ్మా...!!ముద!! చరణం2 పతి దేవుడు నిన్ను తెగతొందర పెడతాడు పదపదమని తన భక్తులకై    పరిగెడుతుంటాడు పరవాలేదని కాస్తా వ...

అదేమిటో కృష్ణా

 *అదేమిటో... కృష్ణా.* తొలి పొద్దున నిను  తలువకుంటే తోచదు నాకు మలిపొద్దున నా మనసు  పరిగెత్తును నీకై క్షణమైనా నిను  మరచితే పొద్దుపోదు నాకు  అనుక్షణం నీ స్మరణలో  యుగమో క్షణమే.... ఎందరున్నా నీవే నావెంట ఉన్నట్లుంది ఏ మాట అయినా నీ నామం వలె వినిపించును ఏమో ఏ కార్యమైన నీ  లీలలవలె అగుపించు అదేమో  ఏ పాట విన్న నీ కీర్తన అయి మది పులకించును నిజము ఎటు పోయిన   నీ గుడి వలేనే గోచరించు అమోఘం ఎవరేమన్నా నీ కథల వలె  అపురూపం నాకు అనుక్షణం నా కనులు         నీ రూపంకై వెతుకు ప్రతిక్షణం నా కరములు ప్రాణామాలు చేయు నిను నిలుపుకొని నా హృదయం పులకించును మైమరచి  ఏమోలే అన్ని నాదాలు స్వరాలు  నీ పిలుపు వలెనే తోచు ఏదో మాయ అంతా నీవై నన్ను అల్లుకునే మాయాతీతమై .. మాధవా  ..      నా లోకమే నీవై      నేనే లేని ఏకమై       ఏదో ఇలా ..మధురిమల సాగరంలో మది మునక లేసే         తనలో తానే          తానే నేనై             ...