అదేమిటో కృష్ణా

 *అదేమిటో... కృష్ణా.*

తొలి పొద్దున నిను 

తలువకుంటే తోచదు నాకు

మలిపొద్దున నా మనసు  పరిగెత్తును నీకై

క్షణమైనా నిను 

మరచితే పొద్దుపోదు నాకు 

అనుక్షణం నీ స్మరణలో 

యుగమో క్షణమే....


ఎందరున్నా నీవే నావెంట ఉన్నట్లుంది

ఏ మాట అయినా నీ నామం వలె వినిపించును ఏమో

ఏ కార్యమైన నీ  లీలలవలె అగుపించు అదేమో 

ఏ పాట విన్న నీ కీర్తన అయి మది పులకించును నిజము

ఎటు పోయిన   నీ గుడి వలేనే గోచరించు అమోఘం

ఎవరేమన్నా నీ కథల వలె 

అపురూపం నాకు


అనుక్షణం నా కనులు  

      నీ రూపంకై వెతుకు

ప్రతిక్షణం నా కరములు ప్రాణామాలు చేయు

నిను నిలుపుకొని నా హృదయం

పులకించును మైమరచి 

ఏమోలే అన్ని నాదాలు స్వరాలు 

నీ పిలుపు వలెనే తోచు

ఏదో మాయ అంతా నీవై నన్ను అల్లుకునే మాయాతీతమై ..

మాధవా  ..

     నా లోకమే నీవై

     నేనే లేని ఏకమై 

     ఏదో ఇలా ..మధురిమల సాగరంలో మది మునక లేసే

        తనలో తానే 

        తానే నేనై

             ...డా౹౹మంగళ మక్కపాటి.

Comments