ముద మరగా నీ రూపం*
*ముద మరగా నీ రూపం*
ముద మారగ నీ మోమును
చూద్దామంటే
మధుసూధను డేలా మారాము
చేస్తాడు
నీ దరహాసంతో
కాస్తా మరిపించమ్మా
!!ముద!!
చరణం1.
వెన్నెల రాజుతో కలిసిఇటు
రావమ్మా
మల్లెల మాలలుచేకొని
మమ్మేలమ్మా
శుక్రవారం వేళా సుచిగా
నోములు నోచి
చిరునవ్వుల పల్లకిని
సిద్ధంగా ఉంచి
హృదయ వీధిలో మిమ్ము
ఊరేగించాలని
మా భావాల బంధువులతో
వేచి ఉన్నామమ్మా...!!ముద!!
చరణం2
పతి దేవుడు నిన్ను తెగతొందర పెడతాడు
పదపదమని తన భక్తులకై పరిగెడుతుంటాడు
పరవాలేదని కాస్తా వారించమ్మా
పగుడాల దీవిలో
విహరించే జననీ
నీ పదముల మంజీరమే
ఈ జగతికి ఆధారం
స్తుతి మణులతో నే కూర్చిన
నా మతిహారం చేకొని
సద్గతి ని ప్రసాదించే
నన్నేలే తల్లీ!!ముద!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺
...డా. మంగళ మక్కపాటి
రామంతాపూర్,హైదరాబాద్.
Comments
Post a Comment