వచ్చే వచ్చేపండుగొచ్చే*..అయ్యప్ప స్వామి పాటలు
*వచ్చే వచ్చేపండుగొచ్చే* *పల్లవి* వచ్చే వచ్చే పండుగొచ్చే వచ్చే అయ్యప్ప స్వాముల దీక్షాలొచ్చే దండి దీక్షాలొచ్చే ... చరణం. ఊరు వాడల భక్తి భావాలు ఉప్పొంగే... కామక్రోధాలు వదిలి కలిసీమెలిసందారు... బజన సంకీర్తనలతో సజ్జన సాంగత్యంతో సత్యవ్రతగదారులై .... స్వామిస్వామి నామంతో ౹౹వచ్చే...వచ్చే౹౹ చరణం ...2 అలంకారాలు వదిలి ఆహార రుచి మరిచి శ్రవణ మననాలతో మనోశుద్ది చేసుకొని నవ విధ భక్తితోడ నానా సేవలు చేసి నూతన శక్తినిపొంది నిత్యానందముతోడఁ ౹౹వచ్చే౹౹2౹౹ డా౹౹మంగళ మక్కపాటి.